సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా బాల భవన్ లో నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరం పోస్టర్ ను సోమవారం డీఈఓ కార్యాలయంలో డీఈఓ అశోక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి మేలు చేసే లలిత కళల శిక్షణ పట్ల చిన్న నాటి నుండే దృష్టి సారించడం వలన కలిగే భవిష్యత్ అద్భుతంగా ఉంటుందన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేసే ఈ కళలను శిక్షణ ఇచ్చే అత్యున్నత అవకాశాన్ని జిల్లా బాల్ భవన్ అందిస్తుండటం చిన్నారులకు వరమని అన్నారు.ఎలాంటి విద్యనైనా ఆడుతూ పాడుతూ ఇష్టంగా నేర్చుకుంటే లాభం చేకూరుతుందని అన్నారు. నృత్యం, చిత్ర లేఖనం, కుట్లు అల్లికలు, సంగీతం, వాయిద్యంతో పాటు సంచార ప్రయోగ శాల ద్వారా జ్ఞానం, మెడిటేషన్ , యోగా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు.చిన్నారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




