హైదరాబాద్: సమాజంలో ముస్లిం మైనారిటీల వెనుకబాటు కు కారణాలు తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఓమర్‌జలీల్ బుధవారం వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల వెనుకబాటుకు కారణాలను వెబ్‌సైట్ ద్వారా ప్రజలు, స్వచ్ఛంధ సంఘాలు ప్రభుత్వానికి అందించొచ్చని తెలిపారు. ప్రజలు, ఇతర సంస్థలు తమ అభిప్రాయాలను కమిషన్‌తో పంచుకోవచ్చని చెప్పారు. ఈ వెబ్‌సైట్ పేరుతో ఫేస్‌బుక్‌లో కూడా కమిషన్ అనుసరించొచ్చని సూచించారు




