హైదరాబాద్ సిటీ: స్వైన్‌ఫ్లూ మరో ముగ్గురిపై దాడి చేసింది. ఈ ముగ్గురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీలో ఇద్దరు, ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మరొక్కరు చేరారు. గాంధీ ఆస్పత్రిలో ముషీరాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల మహిళ, వరంగల్ జిల్లాకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి, ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో మలక్‌పేట నివాసి 32 ఏళ్ల మహిళ స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యాధికారులు తెలిపారు.




