కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమము*
కమ్మర్పల్లి21అక్టోబర్(జనంసాక్ షి)కమ్మర్పల్లి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా శ్రీవిద్య సాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పోలీస్ స్టేషన్ ను సందర్శించి. అమరవీరులైనటువంటి పోలీసులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన లక్షమని తెలిపారు.అలాగే విద్యార్థిని విద్యార్థులకు స్టేషన్ అధికారి, రైటర్, వైర్ లెస్, స్టేషన్ యొక్క విధివిధానాల గురించి విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా షీ టీం యొక్క పనితీరును విద్యార్థులకు తెలియజేశారు.అలాగే విద్యార్థులు పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.పండగ సందర్భంగా పోలీసులకు ప్రమిదలను కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area