ఖరీఫ్‌కు ముందే వందశాతం ఇన్‌పుట్ సబ్సిడీ
విపక్షాల వమర్శలకు మంత్రి పోచారం వెల్లడి
హైదరాబాద్,మార్చి30(జనంసాక్షి): కరవు అంశంపై తెలంగాణ శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. ఖరీఫ్‌కు ముందే రైతులకు వంద శాతం ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీలో సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండపడ్డారు. జీవన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. కొన్ని గైడ్‌లైన్స్‌ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రూ.644 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించామని తెలిపారు. నిజాంషుగర్స్‌పై ఆనాటి సిఎం చంద్రబాబు తన మాట వినకుండా అడ్డంగా అమమకానికి పెట్టిందని మంత్రి అన్నారు. సమైక్యరాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు తొడపై గిచ్చారని ప్రస్తుత మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు..నిజాం షుగర్స్ ప్రైవేటీకరించవద్దని కోరితే చేయి చేసుకున్నారని ఆరోపించారు..ఈ విషయాన్ని ఇదే తొలిసారి బయటపెట్టడమని కూడా వ్యాఖ్యానించారు..దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇప్పుటి సిఎం కూడా కొట్టారని భవిష్యత్ లో చెప్తారా అని ఎద్దేవా చేశారు..కొట్టినప్పుడు మంత్రిగా ఎలా కొనసాగారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు..తెలంగాణకు రుపాయి ఇవ్వనన్న కిరణ్ కేబినేట్ లో కాంగ్రెస్ నేతలు మంత్రులుగా కొనసాగలేదా అని పోచారం వ్యాఖ్యానించారు. టిడిపి శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజా షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని హావిూ ఇచ్చారు.. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలవున్నా ఇంత వరకు నిజాం షుగర్స్‌ను తెరిపించలేదని సభ దృష్టికి తెచ్చారు. నిజాం షుగర్స్‌ను ఎప్పటిలోగా తెరిపిస్తారో స్పష్టమైన హావిూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోంది.. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలని సూచించారు. గత పాలకుల విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుందని విమర్శించారు. కరువుకోరళ్లో చిక్కుకున్న అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని జీవన్‌రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీఒక్కరికీ రూ.5వేల చెప్పున ఆరునెలల పాటు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్ సబ్సీడీ, నాలుగోవిడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలన్నారు. అలాగే పరిమితి లేకుండా ఉపాధి హావిూ పనిదినాలను పెంచాలని డిమాండ్ చేశారు. కరువుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. అయితే జీవన్‌రెడ్డి పదేపదే అవాస్తవాలు చెబుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. సెప్టెంబర్‌లోపే కరవు మండలాలను గుర్తించి ఉంటే కేంద్రం సాయం పొందే అవకాశం ఉండేదన్నారు. రాష్ట్రంలో 443 కరవు మండలాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం కేవలం 231 కరవు మండలాలనే గుర్తించిందని సభ దృష్టికి తెచ్చారు. కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో 50శాతం మేర పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. కరువుపై చర్చ సందర్భంగా కొద్దిసేపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి తలసాని మధ్య వాగ్వాదం జరిగింది. జీవన్‌రెడ్డి అన్నీ అవాస్తవాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తలసాని మండిపడ్డారు. ప్రభుత్వం ఏవిూ చేయడం లేదనే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే మార్కెటింగ్ చేసేవాళ్లకు రైతుల బాధలు తెలియవని తలసానికి జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వలస పాలనలో పాలమూరు జిల్లా బాగా వెనకబడిపోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు అంటే కేవలం కరువు జిల్లాగా పేరు పడిందన్నారు. రాష్ట్రంలో కరువు, జంటనగరాల్లో తాగునీటి సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… కరువు అనే మహమ్మారి తెలంగాణకు చుట్టంగా మారిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో విద్యుత్ రంగం చిన్నాభిన్నమైందన్నారు. పాలమూరు, డిండి, సీతారాం, భక్త రామదాసు ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం అకుపచ్చగా కళకళలాడుతుందని చెప్పారు. గత పాలకుల హయాంలో 40 ఏళ్లు అయిన తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మర్రి జనార్దన్రెడ్డి వెల్లడించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం చారిత్రక ఒప్పందమని చెప్పారు. రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచెందుకు హరితహరం చేపట్టినట్లు మర్రి వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మర్రి జనార్దన్ రెడ్డి వివరించారు.




