Wednesday, 4 November 2026

కరీమాబాదులో ఆకతాయిల ఆగడాలు

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 09 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని కరీమాబాదులో గల అప్పాల వారి వీధిలో ఆకతాయిలాగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి స్థానికుడు, బాధితుడు రంజిత్ తోపాటు అక్కడి ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం..  కరీమబాద్ దసరా రోడ్,అప్పల వారి వీధిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కారు మరియు బండ్లు పార్కు చేసి ఉన్నచోట వాటి యొక్క అద్దాలు పగలగొట్టడం బండ్ల లో నుంచి పెట్రోల్ తీయడం సెల్ఫ్ మోటర్లు దొంగిలించడం, వాహనాల కార్బైటర్లను విప్పడం, నిత్యం ఈ వీధిలో జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతవాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇంటి ముందు కార్లు గాని బండ్లు గాని పెట్టుకోవడానికి జంకుతున్నారు. ఈ ఒక్క సమస్య నుంచి తప్పించాలని కాలనీవాసులు మిల్స్ కాలనీ  పోలీస్ స్టేషన్ వారిని కోరుతున్నారు.

ఇటీవల కోదాటి అనిల్ పార్క్ చేసిన కార్ కి గీతలు పెట్టారు. కొండపాక సురేందర్ బుల్లెట్ బైక్ లో నుంచి పెట్రోల్ తీశారు. కొలిపాక శివ  బైక్ ఇండికేటర్ విరగగొట్టడం, పెట్రోలు తీయడం, మాటేటి సంతోష్ బండి  సెల్ఫ్ మోటర్ దొంగతనం చేయడం జరిగింది. రంజిత్ కుమార్ కార్ అద్దం పలగొట్టారు. ఈ విధంగా నిత్యం ఈ కాలనీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వాహనాలను ఇంటి ముందు పార్కింగ్ చేయాలంటనే భయమేస్తుందని స్థానిక గృహవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఆకతాయిలను పోలీసుల గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు స్థానిక గృహవాసులు వివిధ వాహనాల బాధితులు చెబుతున్నారు.