Wednesday, 4 November 2026

కరువు మండలాల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డ నేపధ్యంలో కరువు మండలాల ఎంపిక కోసం ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో 8 మంది ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తెలంగాణలోని ఒక్క హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో కరువు పరిస్థితులేర్పడ్డాయి. సరైన సమయానికి వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీంతో ఆయా జిల్లాల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇది చూసి తట్టుకోలేక రైతులు రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఓపక్క పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే దారి లేక, మరోపక్క ఎండిన పంటలు చూసి తట్టుకోలేక రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వంపై ముప్పేట దాడి ప్రారంభించాయి. కాగా… రాష్ట్రంలో కరువు పరిస్థితులేర్పడడంతో మొత్తం ఏయే మండలాల్లో కరువు ఏర్పడిందన్న వివరాలను సేకరించేందుకు మొత్తం 8 మంది ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *