Wednesday, 4 November 2026

రైతుల కోసం రైతుమిత్ర నిధి: మంత్రి ప్రత్తిపాటి

విజయవాడ,  రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి. పుల్లారావు చెప్పారు. ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. రైతు ఆత్మహత్యలకు కారణాలపై కలెక్టర్‌లు అధ్యయనం చేయాలని సూచించారు. కష్టాల్లో ఉన్న రైతుల కోసం రైతుమిత్ర సహాయనిధిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో ప్రత్యాయ్నాయ పంటలకు సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి జగన్ దీక్షపై స్పందించారు. మనుగడ కోసమే జగన్ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. రాజధానికి రైతులు భూములు ఇవ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి ప్రత్తిపాటి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *