సెస్ కార్యాలయం ముట్టడించి ఆందోళనరాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 13. (జనంసాక్షి). కరెంటు కోతలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసిసి ఆధ్వర్యంలో సెస్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం మొత్తం 24 గంటలు కరెంటు ఇస్తామని గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్న కరెంటు కోతల పట్ల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు వాస్తవంలో జరగడం లేదని అన్నారు. కరెంటు కోతల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ చెబుతున్న మాటలకు చేతులకు పొంతనలేదని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, ఎస్ఎస్సి జిల్లా అధ్యక్షులు అక్కునూరు బాలరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పలువు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




