Wednesday, 4 November 2026

అగ్ని మాపక పరికరాల పట్ల అవగాహన సదస్సు

 

 

 

 

 

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : అగ్నిమాపక పరికరాలు, వ్యవస్థ పట్ల సోమవారం ఆర్కేపీ1ఏ గనిపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా గని యాక్టింగ్ మేనేజర్ బి. జయంత్ కుమార్ మాట్లాడుతూ అగ్ని మాపక పరికరాలు వాడే విధానం పై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండాలని వివరించడం జరిగింది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం కార్మికులతో రక్షణ ప్రతిఙ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో గని పిట్ ఇంజనీర్ సతీష్ , టి బి జి కే ఏస్ పిట్ సెక్రెటరీ శ బండారి బిక్షపతి, ఏ ఐ టీ యు సి పిట్ సెక్రెటరీ సురమల్ల వినయ్ కుమార్, అధికారులు, యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు
రక్షణ ప్రతిజ్ఞ చేయడం తో ఈ కార్యక్రమం ముగిసింది