నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఫిబ్రవరి10 (జనంసాక్షి):పెద్దకొత్తపల్లి మండలంలో కరెంట్ సక్రమంగా సరఫరా చేయక రైతులు వేసిన పంటలు ఎండుతున్నాయని భారతీయ జనతా పార్టీ పెద్దకొత్తపల్లి మండలాధ్యక్షుడు పదిర భీమేశ్వర్ రెడ్డి అన్నారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు రైతులతో కలిసి ఏఈ కార్యా లయంకు వెళ్లి రైతులు ఎదుర్కొంటున్న కరెంటు సమస్యపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఏఈ అందుబాటులో లేకపోవడంతో అతనితో ఫోన్ లో మాట్లాడి రైతుల కరెంట్ సమస్య ను దృష్టి కి తీసుకెళ్ళారు.ఈ సందర్భంగా పధిర భీమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతుందే తప్ప ఆచరణలో చూస్తే అంతా శూన్యమే నని ఎద్దేవా చేశారు.తొమ్మది గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెద్దకొత్తపల్లి మండలంలో గత నాలుగు రోజుల నుంచి రెండు గంటలు మాత్రమే రైతులకు త్రీఫేస్ కరెంటు ఇవ్వడం జరుగుతోందని దీని కారణంగా రైతులు వేసుకున్న పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. రైతులకు జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పంటలకు నీరందించేం దుకు సరిపడా సమయం త్రీఫేస్ కరెంట్ ను సరఫరా చేయాలని ఈసందర్భంగా ఏఈకి విజ్ఞప్తి చేశారు.రెండు మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను తొందరగా పరిష్కరిస్తే బాగుంటుందని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గువ్వలి వెంకటయ్య, జిల్లా అధికార ప్రతినిధి పెబ్బేటి మల్లేష్, మండల ప్రదానకార్యదర్శి బెల్లె తిరుమల్ యాదవ్, జింకల వెంకటస్వామి, మండల ఇన్చార్జి కడ్తాల కృష్ణయ్య, దేశముని పరుశురాం, ఇంద్రకంటి శేఖర్,అమ్మపల్లి మల్లేష్, జింకల గోపాల్, పిల్లి నాగరాజు, నక్కనమోని కురుమయ్య,రాముడు,శరత్,శివ ప్రకాష్ తదితరులు మరియు రైతులు పాల్లొన్నారు.




