కరెంట్ షాక్ తో ఎద్దు మృతి….
చిలప్ చేడ్/డిసెంబర్/జనంసాక్షి :- మండల కేంద్రమైన చిలప్ చేడ్ లో వెంకట్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద గల ట్రాన్స్ఫార్మర్ వద్ద మన్నే దశరథ అనే రైతు ఎద్దు ట్రాన్స్ఫర్మర్ ఎర్త్ వైర్ కు తగిలి ఎద్దు కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ సుమారు 80 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఎద్దు మృతితో తమ జీవానాధారం కోల్పోయామని ప్రభుత్వ అధికారులే తమను ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు




