ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 10,
జనం సాక్షి:
ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కరోనా సమయంలో అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న పట్టణానికి చెందిన జావిద్ ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రెండులక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే, జావిద్ కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల మాట్లాడుతూ,అనారోగ్యంతో బాధపడుతు వైద్యం చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమ్యూనిటీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా,ఎండి షాకీర్ సిద్దికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్గం గంగాధర్, సాదక్, సమీర్ తదితరులు పాల్గొన్నారు
ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు




