Monday, 2 November 2026

కరోనాను ఖతం చేద్దాం: మంత్రి హరీష్ రావు

ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ లో భాగంగా నా కుటుంబ సభ్యులతో కలిసి తాను ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీష్‌ తెలిపారు. పోలీసులు ,మిలటరీ వాళ్ళు పెట్టిన దానికన్నా మీరు స్వచ్చందంగా ఈ కర్వ్యూ ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏం కాదనే అనే ధోరణి వద్దే వద్దు అలాంటి ధోరణి వలన చైనా ఇటలీ లాంటి దేశాలు ఎలా వనికి పోతున్నాయే చూస్తున్నాము. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం. మన కుటుంబాన్ని, మన రాష్టాన్ని,మన దేశాన్ని రక్షించు కుందాం. మన ఇంట్లో మనం ఉందాం. కరోనా ను ఖతం చేద్దామని హారీష్ రావు సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశం ఇచ్చారు.