Thursday, 5 November 2026

కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో రానున్న మార్పుకు నాంది….

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్. మండల పరిధిలోని గాజుమల్కాపురం పొట్లపహాడ్ గ్రామలలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల సురేష్ రావు ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం వెలువడిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయ బేరి మోగించడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో రానున్న మార్పుకు నాంది ఆశ భావన వ్యక్తం చేస్తూ,కర్ణాటక ఎన్నికల లో గెలుపుకు కృషి చేసిన సోనియా, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, సిద్ధరామయ్య,D.K. శివకుమార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా
కర్ణాటక ఎన్నికల ప్రచారం లో ప్రధాని మోడీ, అమిత్ షా తమ స్థాయికి దిగజారి గల్లి, గల్లి తిరిగి అబద్ధపు ప్రచారాలు,మత విద్వేషాలు రెచ్చగొట్టి నప్పటికీ, విజ్ఞులైన కర్ణాటక ప్రజలు బిజెపి పార్టీకి గుణపాఠం చెప్పారు. రాబోయే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల లో కూడా కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయం సాధించడం ఖాయం ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ శ్రీధర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, ఎగ్గడి యాదగిరి,  ప్రవీణ్ షకీల్ సందీప్, నాగార్జుున, భరత్, బచ్చలకూరి నరేష్, సైదులు, దొంతగాని వెంకన్న, బెల్లంకొండ నాగభూషణ్, సైదిరెడ్డి, బండి చెన్న కృష్ణారెడ్డి, బండి వీరారెడ్డి,శ్రీను, లింగయ్య, మధు, సత్యనారాయణ రెడ్డి, బచ్చలకూరి సైదులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..