కర్నాటకలో జోరుగా వర్షాలు

బెంగళూరు,జూన్‌12(జ‌నం సాక్షి ): సమయానికన్నా ముందుగానే వచ్చిన రుతుపవనాలతో కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నిన్న రాష్ట్రంలోని ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉడుపి, ఉత్తర కన్నడ, హాసన్‌, చిక్‌ మంగళూరు ప్రాంతాల్లో సోమవారం 13 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది.