కర్నూల్ జనంసాక్షి : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక సాధికారత పథకాన్ని ప్రవేశ పెట్టామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూల్‌లో సామాజిక సాధికారత పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని కష్టాలున్నా, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సంక్షేమపథాలు కొనసాగిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. పేదల కోసం పించన్‌ల మొత్తాన్ని పెంచామన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద వికలాంగులు, వితంతువులకు, వృద్ధులకు పించన్‌లు ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక్కొక్కరికి అయిదుకిలోల చొప్పున బియ్యం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామన్నారు.




