మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో..ఉత్సాహం కనిపించింది!ఉరకలు వేసింది!భాగంగా జిల్లా విద్యాశాఖాది అధికారి ఎస్ యాదయ్య మార్గదర్శనంలో స్థానిక కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు “చుట్టూ చుక్కల చూడు మధ్యన వీరులు చూడు”..స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “ఇదేరా తెలంగాణ ఉద్యమాలు ఇలాకా”హార్ట్ బీట్ అకాడమీ” తెలంగాణ కవులకు జోహార్లు.. కళాకారులకు జోహార్లు”అంటూ అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు…
ఉత్సవాల వ్యాఖ్యాతలుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్, బి. నారాయణరావు తెలంగాణ మాండలికంలో పదాలను పేర్చుతూ సందర్భోచిత వ్యాఖ్యానంతో అలరించారు.
ప్రదర్శనలు చేసిన చిన్నారులకు ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎం.ఎల్. ఏ.. నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంస పత్రాలను అందించి అభినందించారు.




