Tuesday, 3 November 2026

కలెక్టరేట్‌ ఎదుట ఐకాసా ఆందోళన

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ జిల్లా నవ్విపేట సహకార సంఘం ఎన్నికల్లో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒత్తిళ్ళ మేరకు చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేశారని ఆరోపిస్తూ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఎదుట టిఆర్‌ఎస్‌, టిడిపి, బిజెపి, సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. సహకార సంఘం ఎన్నికల్లో నలుగురు టిఆర్‌ఎస్‌, ఒకరు సిపిఐ, బిజెపి నుంచి ఒకరు, టిడిపి నుంచి ఒకరు డైరెక్టర్లు ఎన్నికకు పూర్తి కోరం ఉండగా మంత్రి సుదర్శన్‌రెడ్డి తన అనుచరుడు రాజిరెడ్డిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఇద్దరు కాంగ్రెస్‌ డైరెక్టర్లు అపహరణకు గురిచేశారని అధికారులపై ఒత్తిళ్ళు తీసుకువచ్చి ఎన్నికను వాయిదా వేశారని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి ఆరోపించారు. తమకున్న ఏడుగురు డైరెక్టర్లతో కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *