Tuesday, 3 November 2026

ఫిబ్రవరిని 7న అక్బరుద్దీన్‌ను మరోసారి హాజరు పరచాలి కోర్టు ఆదేశాలు

నిజామాబాద్‌, జనవరి 31 (): ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని ఫిబ్రవరి 7వ తేదీన మరోసారి కోర్టు ముందు హాజరుపరచాలని జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. మతవిద్వేషాలను రెచ్చగొట్టారని అభియోగంపై రెండురోజులపాటు అక్బరుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్న నిజామాబాద్‌ పోలీసులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారణ నిర్వహించారు. ఉదయం 11:30నిముషాలకు ఎఆర్‌హెడ్‌ క్వార్టర్‌లో డిఎస్పీ రామ్మోహన్‌రావు సమక్షంలో విచారించిన పిదప సాయంత్రం అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు అక్బరుద్దీన్‌ పోలీసులు హాజరుపరిచారు. ఫిబ్రవరి 7వ తేదీన మరోసారి కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో అక్బరుద్దీన్‌ తిరిగి ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *