Tuesday, 3 November 2026

చైర్మన్‌గా రాజీరెడ్డి నాలుగోసారి ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ సహకార సంఘం అధ్యక్షుడిగా వరుసగా  నాలుగోసారి కాంగ్రెస్‌ నాయకుడు ఎ.రాజీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొదటి విడతగా జరిగిన సహకార ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. దూపల్లి గ్రామంలో రఘుపతిరెడ్డి, నీలా సంఘానికి అహ్మద్‌బేగ్‌, మాప్లూరు సంఘానికి దయాకర్‌రావు, మోపాల్‌ సంఘానికి ప్రసాద్‌, బోర్గాం సంఘానికి శేఖర్‌రెడ్డిలు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికలకు అవసరమైన డైరెక్టర్ల కోరం లేదని నిజామాబాద్‌ మండలం పాల్ద ఎన్నికలను ఒకరోజుకు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *