Friday, 6 November 2026

కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం

కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం….
టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 21,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 51,05,916 రూపాయల విలువగల 51 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు ,టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు