Friday, 6 November 2026

పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి.

– సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే రహదారుల అభివృద్ధి.
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ రేగా.
– దేశంలోనే తెలంగాణ పథకాలు గొప్పవి.
– సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి.
– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .

కరకగూడెం,(జనంసాక్షి): మండలం లోని కొత్తగూడెం, తుమ్మలగూడెం, అనంతారం, పద్మాపురం, వెంకటాపురం, కౌలూరు, పోలకమ్మతోగు, సమత్ భట్టుపల్లి,చిరుమళ్ల, వీరాపురం, కన్నయిగూడెం,భట్టుపల్లి, కరకగూడెం గ్రామాలలో సుమారు 75 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న 20 సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు .ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,
తెలంగాణ సర్కార్ హయాంలో పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు, గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేయడం హర్షనీయమని ఆయన కొనియాడారు. రానున్న ఏడాది కాల వ్యవధిలో గ్రామాల రూప రేఖలు మారుతాయని, తెలంగాణ సర్కార్ లో అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తున్నది, రైతు బీమా, రైతు బంధు పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు.గ్రామాభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నదని తెలిపారు.దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు, ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలతో రాష్ట్రం పురోగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవడం సీఎం కేసీఆర్ ప్రభుత్వ గొప్పతనం అని ఆయన కొనియాడారు.ఏజెన్సీ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ప్రత్యేకంగా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్ మెంట్ పండు 100 కోట్లు ఇచ్చారని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునిసిపల్ శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథంలో దూసుకుపోతుంది అన్నారు.నియోజవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ,ప్రణాళిక బద్ధంగా సిసి రోడ్లు రహదారులు, మంజూరు చేసి వాటిని పూర్తి చేసేలా చూస్తున్నామన్నారు, పట్టణాలతో సమానంగా పల్లెల అభివృద్ధి చెందుతున్నాయని కితాభిచ్చారు, ప్రజలకు కావలసిన సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,సంబంధిత శాఖ అధికారులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు