కల్లాల్లో ధాన్యం. రైతు గుండె ధైన్యం.కల్లాల్లో ధాన్యం. రైతు గుండె ధైన్యం.- కొనుగోలు కేంద్రం ఎత్తివేతతో రైతుల తిప్పలు.- ఇదే అదునుగా దండుకుంటున్న దళారులు.బెల్లంపల్లి, డిసెంబర్ 1, (జనంసాక్షి )కల్లాల్లోనే ధాన్యం ఉండి పోవడంతో రైతన్న గుండె ధైన్యం గా మారింది. అన్ని చోట్ల కొత్త కొత్త వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికి ఇక్కడ మాత్రం గత అరేళ్లుగా విజయవంతం గా నడుస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారు. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో గత ఆరేళ్లుగా కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఈ ఏడాది ఎత్తివేశారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి మంచి దిగుబడి వచ్చిందని సంతోషించిన రైతులకు కొనుగోలు కేంద్రం ఎత్తివేయడం శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల దగా – రైతన్న ఆగంగొల్లపల్లి గ్రామం ఆరేళ్లుగా నడుస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేసిన విషయం తెలుసుకున్న దళారులు రైతులను దగా చేయడానికి సిద్దమయ్యారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు ₹ 2060 ఉండగా దళారులు మాత్రం క్వింటాలుకు ₹ 1600 నుంచి ₹ 1800 లోపు మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇంకా ఇందులో తప్ప, తాలు, తరుగు పేరిట క్వింటాలుకు అయిదు కిలోల నుంచి 8 ఎనిమిది కిలోల వరకు కోత విదిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు ధాన్యన్ని దళారులకు సమర్పించుకుంటున్నారు.
ఎత్తివేతకు కారణం పిర్యాదు చేయడమేనా?
గత యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రం అవకతవకలపై గొల్లపల్లి రైతులు ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు. దీన్ని అలుసుగా తీసుకొని అసలు కొనుగోలు కేంద్రమే లేకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది జరిగింది గత యాసంగిలో గొల్లపల్లి కొనుగోలు కేంద్రంలో సుమారు 20 లారీలకు పైగా ధాన్యం కొనుగోలు జరిగాయి. ఇందులో ప్రతి లారీకి 30 బస్తాలు మిల్లర్లు కోత విదిస్తున్నారని, కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతులకు చెప్పడంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు రాత పూర్వకంగా పిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తర్వాత రషీదు ఇవ్వాల్సి ఉండగా అలా ఇవ్వకుండా కొనుగోలు చేసిన ధాన్యం లారీల్లో మిల్లుకు తరలించిన తర్వాత అక్కడ మిల్లర్లు కోత విధించారని చెప్పి రైతులను మోసం చేశారని ఈ విషయాలను అన్ని పూసగుచ్చినట్లుగా ఉన్నతాధికారులతో, సీఎంఓ కార్యాలయానికి పిర్యాదు చేయడంతో రైతులకు అప్పుడు న్యాయమే చేశారని, కానీ ఇప్పడు కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పునరుద్దరించాలని గొల్లపల్లి రైతులు కోరుతున్నారు
కల్లాల్లో ధాన్యం. రైతు గుండె ధైన్యం.కల్లాల్లో ధాన్యం.




