SFI అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి…SFI అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి…
SFI నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ …
విద్యా భారతి ఒకేషనల్ జూనియర్ కళాశాల లో పోస్టర్లు ఆవిష్కరణ…
నూతన విద్యా విధానం రద్దు చేయాలి బైంసా : రూరల్ డిసెంబర్01 జనం సాక్షి భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిలభారత మహాసభలు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై డిసెంబర్ 13 నుండి 16 వరకు జరుగుతున్న సందర్భంగా , మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ విద్యా భారతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ :దేశంలోనే విద్యారంగ సమస్యల మీద రాజి లేని పోరాటాలు చేస్తూ, దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి సమాన విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు.. భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు తెలంగాణలో జరగడం అభినందనీయమని అన్నారు…. తెలంగాణ రాష్ట్రంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయాలని , సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని అన్నారు… దేశం నుండి నలుమూలల రాష్ట్రాల నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, భవిష్యత్తు కర్తవ్యాలు , తీర్మానాలు చేసుకొని ఉద్యమా రూపకల్పన కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు.. ఈ సందర్భంగా మహాసభలు జయప్రదం చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉదయ్, హరీష్, యువరాజు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
SFI అఖిలభారత మహాసభలను జయప్రదం




