కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ వోలే లక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంత ప్రజల కంటి సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన కంటి శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేస్తుందన్నారు.కావున గ్రామ ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు.ఈ కంటి వెలుగు కార్యక్రమం డాక్టర్ హిమాంజలి పర్యవేక్షణలో నిర్వహించబడు తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్,ఎంపీటీసీ సంధి సుజాత,జిల్లా పరిషత్తు కో ఆప్షన్ మెంబర్ సిరాజ్,ఏఎంసి వైస్ చైర్మన్ రాం రెడ్డి,ఏఎన్ఎం సుజాత,కార్యదర్శి ప్రతాప్,వోలె లింగప్ప,డోలి సాయగొండ,కర్రోల్ల సాయిలు, కల్లుర్ గ్రామపంచాయతి పాలకవర్గం సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కల్లూర్లో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్.కల్లూర్లో కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్.




