కోటగిరి మార్చి 14 జనం సాక్షి:-పోతంగల్ మండలంలోని కల్లూరు గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ మంగళవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సాంప్రదాయకంగా బోనాలను నెత్తిన ఎత్తుకున్న మహిళలు శివశక్తుల పూనకాలతో డప్పు చెప్పులతో ఊరేగింపుగా ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లి బోనాలను సమర్పించి మొక్కలను తీర్చుకున్నా రు.ఈ వేడుకలలో గౌడ సంఘం అధ్యక్షులు బి.రామా గౌడ్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ లింగప్ప,కోటగిరి మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి,బి.బాలనర్స గౌడ్,ఎంపీటీసీ సుజాత వెంకటరెడ్డి,బి శేఖర్ గౌడ్,బి లింగయ్య,పీర్ గొండ,సాలె నారాయణ,కుమ్మరి గంగారాం,తెనుగు విట్టల్,గ్రామ పెద్దలు,మహిళలు, యువకులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు




