కోటగిరి మార్చి 14 జనం సాక్షి:-పోతంగల్ మండలం జల్లాపల్లి ఆభాది గ్రామంలో గ్రామసభ సాదాసీదాగా సాగింది.మంగళవారం గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ వివేక్,ఎంపీవో మారుతి అధ్యక్షన గ్రామసభ నిర్వహించారు.గ్రామంలోని ఎన్ఎస్ఎఫ్ ఇండ్ల పట్టాల విషయమై ప్రజల,ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గ్రామ సభను ఉద్దేశించి ఎంపీవో మారుతి మాట్లాడుతూ.ఎన్ఎస్ఎఫ్ ఇండ్ల పట్టాల విషయంలో ఒకరు పట్టాదారులుగా ఉంటే, మరొకరు కబ్జాలకుపాలుబదిన సంఘటన గ్రామంలో నెలకొందన్నారు.ఈ విషయమై గ్రామంలో కొన్ని రోజు లుగా గొడవలు,కొట్లాటలతో కూడిన వాతావరణం నెలకొందన్నారు.ఇలాంటి సంఘటనలు మరో మారు పునరావృతం కాకుండా గ్రామసభను మంగళవారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామంలో సుమారు 60 ఎన్ఎస్ఎఫ్ ఇండ్ల పట్టలలో ఒకరిద్దరికి పట్టాలు ఉండడం చేత అనేక రకాల గొడవల వాతావరణం గ్రామంలో నెలకొన్నది.కావున ఎమ్మార్వో ఇట్టి విషయమై గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్వే ద్వారా వాస్త అవాస్తవాలను నీగ్గు తేల్చి సరైన పట్టాదారుడికి న్యాయం చేయాల్సిందిగా గ్రామసభ ద్వారా తీర్మానం చేయడం జరిగిందన్నారు.ఈ సభలో స్థానిక సర్పంచ్ వివేక్,కార్యదర్శి శ్రీవాణి,ఉప సర్పంచ్ బీమా,వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.




