Wednesday, 4 November 2026

కల్వచర్ల లో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

 

 

 

 

 

 

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపిపి అరెల్లీ దేవక్క, జెడ్పీటీసీ శారద తో కలిసి స్థానిక సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు వైద్య శిభిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలును ఉచితంగానే అందించడం జరుగుతుందాన్నారు. ఈ నెల 29 వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించబడునని కావున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి ప్రదీప్, కల్వచర్ల ఎంఎల్ వో దీరజ, ఎంపివో కాటం భాస్కర్, కార్యదర్శి శ్రీనివాస్, ఎంపిటిసి కొట్టె సందీప్, ఉప సర్పంచ్ వేము కనకయ్య,వార్డ్ సభ్యులు బిరుదు భాగ్యలక్ష్మి, ఇరుగురాల కమల, కో ఆప్షన్ సభ్యులు బోల్లవరం భాస్కర్ రావు,వొడితల శారద, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.