Tuesday, 3 November 2026

కల్వచర్ల లో హైమ్యాక్స్ లైట్స్ బిగింపు

రామగిరి, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వ చర్ల గ్రామంలో సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి అధ్వర్యంలో హై మ్యాక్స్ లైట్స్ బిగించారు. స్థానిక అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన హై మ్యాక్స్ లైట్స్ పనిచేయడం లేదని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సర్పంచ్ స్పందించి నూతన లైట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేము కనకయ్య, పంచాయితి కార్యదర్శి శ్రీనివాస్, వార్డ్ సభ్యులు ఇరుగురాల కమల, సిబ్బంది లింగయ్య, ఓదెలు తదితరులు పాల్గొన్నారు