కళాకారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి

వేములవాడ, ఆగస్టు 10 (జనంసాక్షి): కళాకారుల సంఘ భవనానికి స్థలం కేటాయించాలంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకు వినతి పత్రం సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటుగా పట్టణం లోని కళాకారులు ప్రదర్శన అనంతరం విశ్రాంతి, నూతన కళాకారుల శిక్షణ ఇచ్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యెల్ల పోచెట్టి, జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు, అధ్యక్షులు సా వణపల్లి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య,కోశాధికారి బుర్రి శంకరయ్య, లక్ష్మీనారాయణ, బొడ్డు నారాయణ, సోమినేని బాలు తదితర కళాకారులు పాల్గొన్నారు.

తాజావార్తలు