Thursday, 5 November 2026

కళ్యాణలక్ష్మి చెక్కును అందించిన ఎంపీపీ బస్వసావిత్రి మల్లేశం

కళ్యాణలక్ష్మి చెక్కును అందించిన ఎంపీపీ బస్వసావిత్రి మల్లేశం

దేవరుప్పుల,17(జనం సాక్షి):రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, పథకాలను ప్రవేశపెట్టారని ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేశం తెలిపారు. దేవరుప్పుల మండలం ధారవత్ తండాకు చెందిన ఐదుగురికి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేశం అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేశం మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గేమ నాయక్ గ్రామ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు