Thursday, 5 November 2026

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పోటీలలో ఎంపికైన తెలుగు,ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పోటీలలో ఎంపికైన తెలుగు,ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు

 

దేవరుప్పుల, డిసెంబర్ 17(జనం సాక్షి):దేవరుప్పుల మండలం, కామారెడ్డి గూడెం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల స్థాయి గణిత టాలెంట్ పోటీ పరీక్షను నిర్వహించారు.
ఈ పోటీల్లో దేవరుప్పుల ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి చిత్రజ, శివాని, శ్రీ తేజ, తెలుగు మీడియం నుండి అఖిల, అనూష, విక్రం, లు 19 తేదీ న జరిగే జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికయ్యారు.
ఈకార్యక్రమంలో కామారెడ్డి గూడెం హెచ్ఎం శ్రీలత, వివిధ పాఠశాలల గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.