Tuesday, 3 November 2026

కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేసిన బీఆర్ఎస్ నేత నాల్చర్ రాజు

 

 

 

 

 

 

 

బిచ్కుంద ఫిబ్రవరి 4 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల సీతారాంపల్లి గ్రామం నందు శనివారం నాడు కమల బాయ్ భర్త దేవి సింగ్ కి కళ్యాణ లక్ష్మి చెక్కు బీఆర్ఎస్ నేత నాల్చర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్రమే కాకుండా దేశమంత కేసిఆర్ ను ఆదరిస్తున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, బిచ్కుంద సహకార సంఘం ఉపాధ్యక్షుడు యాదవరావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిద్దిరాం పటేల్, హాజీ లక్ష్మణ్ మరియు మాణిక్ సెట్ తదితరులు పాల్గొన్నారు.