Tuesday, 3 November 2026

గడపగడపకు బిజెపి ఇంటింటికి అరుణ తార

 

 

 

 

 

బిచ్కుంద ఫిబ్రవరి 4 (జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణ తార శనివారం రోజున మద్నూర్ మండలకేంద్రంలో గడపగడప ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు మద్దతు ఇవ్వాలని, ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హన్మండ్లు, వీరేశం, కృష్ణ పటేల్, తులావర్ సంతోష్, మల్లికార్జున్ దేశాయ్, బాలకిషన్, యాదవరావు, పవన్, ప్రశాంత్ పటేల్ మరియు రాజు తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.