. వీణవంక జనవరి 20 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం 49 మందికి కల్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని, ఇప్పటి వరకు భారతదేశం లోని ఏ ఒక్క రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది లేదని, మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. పేదవారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్ ఎఫ్ చెక్కుల ద్వారా పేద ప్రజలకు ఎంతో భరోసాగా నిలుస్తున్న రాష్ట్రమని తెలిపారు. రైతుబంధు రైతు బీమా. కెసిఆర్ కిట్టు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ. వ్యవసాయ రైతులకు ఉచిత విద్యుత్ దళితులకు దళిత బంధు లాంటి ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందారని, ఇటువంటి అభివృద్ధిని కొంతమంది ఆయా పార్టీల నాయకులు సహించలేక నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరి కాదన్నారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇటువంటి అభివృద్ధికి చేయూత ఇవ్వలేదని, . వీలైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలే గాని, చేసే వారి మీద విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి. పిఎసిఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి. వైస్ ఎంపీపీ రాశేట్టి లత. అధికారులు తాసిల్దార్ రాజయ్య. ఎంపీడీవో శ్రీనివాస్. స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి కొత్తిరెడ్డి కాంతారెడ్డి . కోమల్ రెడ్డి.ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు చదువు మహేందర్ రెడ్డి పంజాల సతీష్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్. లబ్ధిదారులుఅధికారులు ఆర్ఐలు ప్రవీణ్ కుమార్ రవిలు తో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి




