కోటగిరి జనవరి 20 జనం సాక్షి:-కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం దేశానికి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.శుక్రవారం కోటగిరి మండలం ఎంపిడిఓ కార్యాలయం వేదికగా 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ 84 లక్షల రూపాయల విలువ గల చెక్కులను స్పీకర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అనేది సీఎం కేసీఆర్ ఆలోచనలో పుట్టిందని.నిరుపేద ఆడపడుచులకు మేనమామల ఈ పథకం ద్వారా అండగా ఉంటుంన్నారని అన్నారు. నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు తమ రాష్ట్రంలో అమలుపరచాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.బాన్సువాడ నియోజక వర్గనికి సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలు తమ రాష్ట్రాన్ని తెలంగాణలో కలుపుకోవాలని లేదా తమ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాల ని ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారని అన్నారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ వల్లేపల్లి సునిత శ్రీనివాస్,జెడ్పీటీసీ శంకర్ పటేల్, జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు సిరజ్, ఇస్మాయిల్,మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎజాస్ ఖాన్,సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్,రైతుబంధు అధ్యక్షులు కొల్లూరు కిషోర్,మండల సర్పంచ్లు,ఎంపీటీసీలు, అధికారులు,బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.




