కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
బిచ్కుంద డిసెంబర్ 01(జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల చిన్న దడ్గి గ్రామంలో గురువారం నాడు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ నాల్చర్ భారతీ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ఇవాళ కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారని కొనియాడారు. పేదింటి అమ్మాయిలకు పెండ్లి కోసం రూ. 1,00,116లను తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విఠల్ అనితా రెడ్డి, వెంకట్రావు దేశాయ్, ముఖీద్ మరియు సెక్రటరీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ




