
.రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి లోనిఎమ్మెల్యే బాల్క సుమన్ స్వగృహంలో కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్, మందమర్రి సంబంధిత 307 కళ్యాణ లక్ష్మీ చెక్కులు, 50 షాది ముబారక్ రూ.3,57,91,470/- విలువ గల చెక్కులను చెన్నూర్ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎంతో భరోసాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చారని తెలిపారు. ప్రతి పేదింటి మహిళకు అండగా ఉంటూ, గత ప్రభుత్వాలు చేయలేని మరెన్నో సేవా పథకాలు కొనసాగిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




