Wednesday, 4 November 2026

కళ్ళకు గంతలు కట్టుకొని వీవోఏల నిరసన.

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 19, (జనంసాక్షి )తమ డిమాండ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వీవోఏలు బుధవారం కళ్లకు గంతలు కట్టుకొని తమ నిరసన తెలియజేశారు. ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో బతుకు బండిని లాగిస్తున్నామని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, తమకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వీవోఏ యూనియన్ మండల అధ్యక్షుడు తైదల సమ్మయ్య అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో దుర్గం మల్లేష్, చుంచుల మల్లేశ్వరి, లేతకారి గణేష్, ఉషన్న, పురుషోత్తం, అనిల్, భాగ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.