Wednesday, 4 November 2026

కళ్ళలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి రైతులపై జరుగుతున్న దోపిడిని అరికట్టండి పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణంలో వివిధ రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం బృందం పర్యటన చేపట్టి ఆరుకాలం శ్రమించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోకి తీసుకొనివస్తే సంబంధిత అధికారులు గానీ సంబంధిత వ్యవసాయ మార్కెట్ ప్రతినిధులు గాని టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు ఎక్కడ పోయినాయి కల్లాలలో ధాన్యాన్ని చూసి రైతు కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి ఒక దిక్కు తీవ్రమైన ఎండలు మరొక దిక్కు అకాల వర్షాల కారణంగా రైతుల ధాన్యం తడిసి మొలకెత్తుతుంటే ధాన్యాన్ని చూసి రైతులు ఆత్మహత్యనే శరణమని భావిస్తున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం బృందం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యేకంగా చూసి సందర్శించి వాళ్లకు మనోధైర్యం కల్పించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే రైతే రాజు అవుతాడు అన్న రైతుల యొక్క ఆశలు ఆరుకాలం శ్రమించిన పంటను పూర్తిగా చేతికి వచ్చిన పంట దళారులు మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు కనీసం గిట్టుబాటు ధర రాకుండా పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లలేని పరిస్థితిలో అప్పులపాలైతున్నమని తిరిగి పంటను వేసుకోవడం కోసం దాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతు దివాలా తీస్తూ ఆగమయ్యగోచారంగా రైతు కుటుంబాలు బాధలు పడుతున్నారు దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకుల వరకు మిల్లలతో దళారులతో వ్యవసాయ అధికారులతో కుమ్మక్కై రైతులపై పడి దోపిడీ చేస్తూ రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాకుండా అరాచకం చేస్తున్నారు కావున ఇట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష పార్టీలను రైతు సంఘాలను రైతుల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మిల్లర్ దళారులు సివిల్ సప్లై అధికారులు వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతుల పక్షాన ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని కల్లాలో నిల్వ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేంతవరకు పోరాటం చేయాలని రైతులందరూ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ రైతులు ఎవరు కూడా అధైర్య పడద్దని ఆత్మహత్యలకు పాల్పడద్దని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు నెలలలో కచ్చితంగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని రైతులకు ధైర్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జిట్ట మల్లారెడ్డి రైతు విభాగం పట్టణ అధ్యక్షుడు నాయిని వెంకటేశం జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ దాసరి మధు అందే నరేష్ రైతులు జిట్ట బాల్ రెడ్డి గంజి బాల్రెడ్డి కడారి హనుమంతు బండి చిన్న మల్లేశం దొడ్డి బాలయ్య మల్లయ్య పోచయ్య ఎట్టయ్య వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.