వికారాబాద్ రూరల్ మే 22 (జనం సాక్షి)వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వికారాబాద్ తో పాటు వివిధ మండలాల ప్రజలు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే వికారాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను సిద్ధమని డి లైట్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ పేర్కొన్నారు సోమవారం ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మర్పల్లి ధరూర్ కోటపల్లి బంటారం మండలాల ప్రజలు రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు తనపై ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నారని వారందడి అభిప్రాయం మేరకే వికారాబాద్ అసెంబ్లీ స్థానానికి బి ఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నాను దీంతోపాటు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కూడా తనకు మద్దతు ఇస్తామని ముందుకు వస్తున్నందున వికారాబాద్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన అన్నారు ది లైట్ ఫౌండేషన్ ద్వారా చేసిన వివిధ అభివృద్ధి పనులు సంఘ సేవ అయినా రక్తదాన శిబిరాలు క్రీడా పోటీలు డప్పు దరువు ఉచిత వైద్య శిబిరాలు చిన్నారులకు రాయితీతో కూడిన వైద్యం అందిస్తు ఇటు వంటి అనేక కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న డాక్టర్ తుప్ప ఆనంద్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తే ఇతర పార్టీ ల అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తుంది తన సొంత మండలమైన మోమిన్ పేట లో తన తండ్రి తుప్ప రామయ్య సర్పంచ్ గా మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా అనేక సేవలు చేసి మోమిన్ పేటని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తుప్పరామయ్య దే ఆయన ఆశయాలు సాధించాలంటే వికారాబాద్ ఎమ్మెల్యేగా డాక్టర్ తప్ప ఆనంద్ వల్లనే సాధ్యమవుతుందని ప్రజలందరి ప్రజా ప్రతినిధుల అభిప్రాయమని పలువురు పేర్కొంటున్నారు 2023 సాధారణ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు ఎన్ని పార్టీ లు పోటీలో ఉంటాయి వేచి చూడాల్సిందే




