కవియిత్రి బూర రాజేశ్వరికి నివాళులు అర్పించిన సిరిసిల్ల సాహితి సమితి నివాళి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 04.(జనంసాక్షి). కాళ్ళని చేతులుగా మలుచుకొని ఆత్మవిశ్వాసంతో సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేసిన కవయిత్రి బూర రాజేశ్వరికి సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. బుధవారం రాజేశ్వరి పెద్దకర్మను పురస్కరించుకొని సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిరిసిల్ల సాహితీ సమితి తో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొక్కవోని ధైర్యంతో సాహిత్య రంగంలో నిలిచిన తీరు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు మురళీధర్, కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, మదిరెడ్డి అంజనా దేవి, జిల్లా రచతల వేదిక అధ్యక్షులు ఎలగొండ రవి, తదితరులు పాల్గొన్నారు




