Tuesday, 3 November 2026

మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సరిత

మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సరిత

టేకులపల్లి,జనవరి 4( జనం సాక్షి): మన ఊరు మన బడి కార్యక్రమంలో లో భాగంగా టేకులపల్లి గ్రామ పంచాయతీ లో ఎంపిక జరిగిన ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో యం. పి. టి. సి -2 బాలకృష్ణ, ఉప సర్పంచ్ కె సురేష్, 1వ వార్డు సభ్యులు నోముల భానుచందర్, 7వ వార్డు సభ్యులు తాటి రవి, పంచాయతీ కార్యదర్శి యల్. కిరణ్, స్కూల్ హెచ్ ఎమ్ బి. లక్మణ్, వి. భాస్కర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శంకర్ రావు, బి ఆర్ యస్ మండల ప్రధాన కార్యదర్శి బొడ బాలు నాయక్, ధారవత్ సురేష్, బిచ్చు తదితరులు పాల్గొన్నారు.