రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 5.(జనంసాక్షి). గజల్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షులు బూర దేవానందంను ఆత్మీయంగా సత్కరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన గజల్ సాహిత్య వేదిక ప్రత్యేక కార్యక్రమంలో బూర దేవానందం పాల్గొని తన గజల్ ను వినిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవానందం ఆత్మీయంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. దేవానందమును ఆత్మీయంగా సత్కరించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం . మానేరు రచయితల సంఘం,సిరిసిల్ల సాహిత్య సమితి నిర్వాహకులు అభినందనలు తెలిపారు.
కవి బూర దేవానందం కు ఆత్మీయ సత్కారం.




