సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 5 :-రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్న కవి సమ్మేళనంలో పాల్గొనుటకు జిల్లాలోని కవులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తిగల కవులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు, సామాన్య ప్రజల నుండి తమ స్వీయ కవితలను ఉత్తమ కవితల ఎంపిక కోసం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి పై కవితలు ఉండాలన్నారు .కవితలు తెలుగు ,హిందీ ,ఉర్దూ భాషలలో ఉండవచ్చన్నారు.అట్టి కవితలు ఏ పత్రికలో గాని ఇతరత్రా మాధ్యమాల్లో గాని ప్రచురించబడలేదని, కాపీ చేసినవి కాదని,తమ స్వీయ కవితలని ధ్రువీకరించాలని పేర్కొన్నారు.
ఆసక్తి గల కవులు, సాహిత్య అభిమానులు కవి సమ్మేళనం లో పాల్గొనుటకు తమ కవితలను ఈనెల 8వ తేదీ లోపు 15 వరుసలకు మించకుండా కవితలు రాసి, వ్యక్తిగత వివరాలను తెలియజేస్తూ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించి, పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ శరత్ సూచించారు.
వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని ఫోన్ నెంబర్ 9963423691 లో సంప్రదించవలసినదిగా కలెక్టర్ సూచించారు.




