Tuesday, 3 November 2026

కొత్త ఓటర్ నమోదుకు అవకాశం అక్టోబర్,01 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో  జనం సాక్షి,  జూన్ 5 :- ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.సోమవారం  కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ శరత్ తహసిల్దార్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులతో  ఓటరు జాబితా సవరణ,ఫారం 6,7,మరియు 8 ల పరిష్కార పురోగతి, తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.జిల్లాలో  అక్టోబర్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండే వారందరూ తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించి, అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని  కలెక్టర్ తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఈ నెల 15 లోగా  ఇంటింటి సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేసారు.అక్టోబర్ ఒకటి నాటికి 18 iసంవత్సరాలు నిండే ఓటర్ల వివరాలనుబి ఎల్ ఓ లు సేకరించాలన్నారు.