బిచ్కుంద ఏప్రిల్ 12 (జనంసాక్షి) కష్టపడి పనిచేసే వారికి బీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ బృందానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పాటు పడే వారికి తగిన గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అందుకే ఇతర పార్టీ వారు సైతం తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాల్చర్ రాజు, అసద్ అలీ, కోలావార్ కుమార్ సేట్, అశోక్ పటేల్, బస్వరాజ్ పటేల్, వెంకట్రావు దేశాయ్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




