పెనుబల్లి, ఏప్రిల్ 12(జనం సాక్షి)పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన సానిక చెన్నారావు, వనజ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అభిషేక్ (10), చిన్న కొడుకు క్రిస్టఫర్ (9) లు చూడ ముచ్చటి నిరుపేద కుటుంబం.సానిక చెన్నారావు గ్రామీణ వైద్యునిగా స్థానికంగా పనిచేస్తూ వచ్చిన అరకొర రాబడితో కుటుంబాన్ని పోషిస్తూ భార్య పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ముచ్చటైన ఇద్దరు పిల్లలతో సంతోషకంగా సాగుతున్న చెన్నారావు కుటుంబం పై విధి ఒక్కసారిగా వెక్కిరించింది..ఇంతలోనే కాలం కూడ కన్నెర్ర చేసింది.పెద్ద కుమారుడు అభిషేక్ పై ఆరు నెలల క్రితం కాలం కాటు వేసి మృతి చెందాడు.చిన్న కొడుకు పై కూడా కాలం కలిసి రాకపోవడంతో ఆ తల్లిదండ్రుల తీరని దుఃఖాన్ని నింపింది కాలం.పెద్ద కుమారుడు అభిషేక్ కి ఆరోగ్య సమస్యలతో వైద్య పరీక్షలు చేయించడంతో అరుదైన బ్రెయిన్ హ్యూమర్ వ్యాధి అని వైద్యులు నిర్ధారించారు.గత సంవత్సరం 2022 మార్చి 24వ తేదీన హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి అందిన చోట అప్పుచేసి ఉన్నది ఊడ్చి రూ 8 లక్షల ఖర్చుచేసి వైద్యం అందించిన ఫలితం దక్కలేదు.ఆ బాలుడు అభిషేక్ గత జులై 28 తేదీన కన్ను మూశాడు.అంతటితో వారి కుటుంబం పై వీధి కోపం చల్లరలేదు.అది మరవక ముందే తన రెండో కుమారుడు క్రిస్టఫర్(9)కి కూడ వైద్య పరీక్షల్లో బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకుని కోల్పోయిన బాధలో ఉన్న వారికి చిన్న కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితికి ఉన్నారని తెలియడంతో మరింత కృంగిపోయారు ఆ తల్లిదండ్రులు. వైద్యం చేయించడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. చిన్న కుమారుడి వైద్యానికి ఉన్న ఎకరం పొలం అమ్మి వచ్చిన రూ.5 లక్షలు ఖర్చు చేసి వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో రేడియేషన్ కి మరో ఐదు లక్షలు అవసరమవుతుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు.పెద్ద కుమారుడు అభిషేక్ మరణం కళ్ళముందే కదులుతుంటే ఆ పై చిన్న కుమారుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఎవరైనా దాతల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుండి, ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కొరకు ఆ కుటుంబం ఎదురు చూస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలు ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ ఒకరిని పోగొట్టుకొని చిన్న కొడుకు నైనా కాపాడుకుందామన్న ఆరాటంతో దాతలు, స్వచ్ఛంద సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం ఎవరైనా ముందుకు వచ్చి తమ పిల్లవాడికి ప్రాణదానం చేస్తారని ఆశిస్తూ చేయూతని అందించాలని ఆ పేద తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు.
చేయూత అందించే వారు :- సానిక చెన్నారావు బ్యాంక్ అకౌంట్ నెంబర్యూనియన్ బ్యాంక్6352 02010015892ఐఎఫ్సి కోడ్ : యు బి ఐ ఎన్ 0563528 గూగుల్ పే నెంబర్: 9603396988 లకు సహాయం అందించగలరు.




