హైదరాబాద్ : తెరాస అధినేత కేసీఆర్‌పై బంజాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చింతస్వామి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ చట్టం కింద సెక్షన్ 3(1), కేసు నమోదు చేశారు. కేసీఆర్‌తో పాటు పార్టీ నేతలు సుభాషన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జి. పద్మారావు, జగదీష్‌లపై కూడా కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారంటూ చింతస్వామి కేసీఆర్ తదితరులపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బంజరాహిల్స్ పోలీసులు 512/13 కేసు నమోదు చేశారు.




